మహేష్ మరోసారి అదరగొట్టేశాడు!

మహేష్ మరోసారి అదరగొట్టేశాడు!

Published on Apr 22, 2018 10:07 AM IST

గత కొంత కాలంగా విదేశాల్లో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ అందుతోన్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ అనే నేను సినిమాకు కూడా మంచి ఆదరణ దక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే భరత్ అనే నేను బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. యూఎస్ లో కూడా తన బాక్స్ ఆఫీస్ స్టామినాను చూపించాడు. రెండవసారి రెండు మిలియన్ల డాలర్లను అందుకున్న హీరోగా రికార్డ్ సాధించాడు.

ఇంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు కూడా 2 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టి మహేష్ స్థాయిని పెంచేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ ఆయన స్థాయిని మరింత పెంచిందని చెప్పాలి. 2 మిలియన్ల డాలర్లను రెండు రోజుల్లో వసూలు చేయడం చూస్తుంటే మహేష్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలలో భరత్ అనే నేను ప్రస్తుతం 7వ స్థానంలో నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు