‘ఇంటెక్స్ మొబైల్స్‌’కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్..!

‘ఇంటెక్స్ మొబైల్స్‌’కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్..!

Published on Aug 3, 2015 5:00 PM IST

mahesh-babu
మహేష్ బాబు.. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాక, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలోనూ సూపర్ స్టార్‌గా వెలుగొందుతూ వస్తున్నారు. ఇప్పటికే థమ్సప్, టీవీఎస్, టాటాస్కై, ప్యారగాన్.. ఇలా పలు టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వస్తోన్న మహేష్, తాజాగా మొబైల్ రంగంలో పాపులర్ అయిన ఇంటెక్స్ మొబైల్స్‌కు తెలుగునాట బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సైన్ చేశారు. ఇంటెక్స్ సంస్థ ఈ మేరకు మహేష్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఇక ఈ ఉదయం మహేష్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన ఇంటెక్స్ సంస్థ, ఈ విషయమై హైద్రాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మహేష్ చేతుల మీదుగా ఇంటెక్స్‌కు సంబంధించిన కొత్త మొబైల్ ఒకటి లాంచ్ అయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ తన కొత్త సినిమా ‘శ్రీమంతుడు’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు