నేటి రాత్రికి ఆగడు చూడనున్న మహేష్ బాబు

నేటి రాత్రికి ఆగడు చూడనున్న మహేష్ బాబు

Published on Sep 18, 2014 11:37 PM IST

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు అతని టీం సుమారు 6 నెలలుకు పైగా కష్టపడి చేసిన సినిమా ‘ఆగడు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన మహేష్ బాబు ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు.

అన్ని పూర్తయిపోవడంతో రేపు అభిమానులు చూడబోయే ఫైనల్ వెర్షన్ సినిమాని కొద్ది గంటల ముందే మహేష్ బాబు ఈ రోజు రాత్రి ప్రత్యేకంగా హైదరాబాద్ లో చూడనున్నారు. ఆయనతో పాటు ఈమూవీ టీంలోని వారు కూడా సినిమా చూసే అవకాశం ఉంది.

‘ఆగడు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అలాగే యుఎస్ లో ఎన్నడూ లేనంతగా 165 స్క్రీన్ లో షోస్ పడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు