Like us on Facebook
 
జనవరి నుండి మహేష్ బాబు కొత్త సినిమా షురూ !


ఒకవైపు మురుగదాస్ తో ‘స్పైడర్’ సినిమా చేస్తూనే కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల్లో ‘స్పైడర్’ సెప్టెంబర్ 21న రిలీజ్ కానుండగా , కొరటాల ప్రాజెక్ట్ దాదాపు పూర్తవడం జరుగుతుంది.

దీంతో మహేష్ వంశీ పైడిపల్లి ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేయనున్నారు. స్క్రిప్ట్ పరంగా చల్ కొత్తగా ఉంటుందని చెబుతున్న ఈ సినిమా చాలా వరకు యూఎస్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది గానీ ఇంకా పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ వెలువడలేదు.

Bookmark and Share