జనవరి 7 నుండి మహేష్ రీ స్టార్ట్ చేస్తాడు !

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చిన్న బ్రేక్ దొరికినా కుటుంబంతో కలిసి హాలీడేకు విదేశాలకు వెళ్లడం అలవాటు. ఇప్పుడు కూడా మహేష్ భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సీతార, బావ గల్లా జయదేవ్ కుటుంబంతో కలిసి స్విట్జర్ ల్యాండ్ టూరుకు వెళ్లారు. అక్కడే జురిచ్ లో క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకున్న మహేష్ న్యూఇయర్ ను కూడా సెలబ్రేట్ చేసుకుని జనవరి మొదటి వారంలో ఇండియా తిరిగొచ్చి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ విషయాన్నే తెలుపుతూ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు ‘మహేష్ జనవరి ఫస్ట్ వీక్ తిరిగొస్తారు. జనవరి 7 నుండి షూటింగ్ రీ స్టార్ట్ చేస్తారు. రెండు పాటలు మినహా మొత్తం షూట్ ఫిబ్రవరి కల్లా పూర్తవతుంది. ఆ రెండు పాటలని విదేశాల్లో షూట్ చేయాలని అనుకుంటున్నాం. మధ్యలో కొన్ని షాట్స్ ను ముంబై, పూణేల్లో చిత్రీకరిస్తాం’ అన్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

Like us on Facebook