మురుగదాస్‌కు విషెస్ చెప్పిన మహేష్!

మురుగదాస్‌కు విషెస్ చెప్పిన మహేష్!

Published on Sep 25, 2016 2:02 PM IST

mahesh-and-murugu-das
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే చెన్నైలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఇక నేడు తన పుట్టినరోజు జరుపుకుంటోన్న దర్శకుడు మురుగదాస్‌కు మహేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మురుగదాస్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని మహేష్ ఈ సందర్భంగా అన్నారు. ట్విట్టర్ ద్వారా మహేష్ మురుగదాస్‌కు విషెస్ తెలిపారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా విషయానికి వస్తే, ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‍గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ మరో నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు