రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ ‘బ్రహ్మోత్సవం’!

రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ ‘బ్రహ్మోత్సవం’!

Published on Dec 1, 2015 9:54 AM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ అనే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అనౌన్స్ అయిన రోజునుంచే ‘బ్రహ్మోత్సవం’పై మంచి మంచి అంచనాలు బయలుదేరాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే పీవీపీ సినిమా ‘బ్రహ్మోత్సవం’ను భారీ ఎత్తున కలర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్‌లు నటించడం ఈ సినిమాకు విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బ్రహ్మోత్సవం కోసం వేసిన స్పెషల్ సెట్‌లో మహేష్ బాబు, సత్యరాజ్, తనికెళ్ళ భరణిల నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక మరో వారం పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా డిసెంబర్ 9న ఊటీలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు