తమిళ విడుదలకు సిద్దమవుతున్న మహేష్ సినిమా !

‘స్పైడర్’ చిత్రంతో కోలీవుడ్లో అధికారికంగా లాంచ్ అయ్యారు మహేష్ బాబు. ఆ చిత్రంతో ఇదివరకటి కన్నా ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో అక్కడి డిస్ట్రిబూటర్లు మహేష్ గత తెలుగు సినిమాల్ని ఇప్పుడు దబ్ చేసి మరీ తమిళంలో విడుదల చేసేందుకు ముందుకొస్తున్నారు. మహేష్ 2016లో చేసిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తమిళంలో ‘అనిరుద్’ పేరుతో విడుదలకానుంది.

ఇప్పటికే డబ్బింగ్ కు సంబందించిన పనులు జరుగుతుండగా పక్క విడుదలతేదీని ఇంకా ప్రకటించలేదు అక్కడి సమర్పకులు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉన్న కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లు నటించి ఉండటం ఈ అనువాదానికి మరింత కలిసొచ్చే అంశం.

 

Like us on Facebook