‘మహేష్23’ టైటిల్, ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..!

‘మహేష్23’ టైటిల్, ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..!

Published on Dec 6, 2016 3:39 PM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరు సౌతిండియన్ లెవెల్ స్టార్స్ కలిసిచేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోన్న సినిమాకు టైటిల్ ఏమై ఉంటుందీ? ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందీ? అన్నదానిపై చాలారోజులుగా చర్చలు జరుగుతూ వస్తున్నాయి.

కాగా తాజాగా ఇదే విషయంపై టీమ్ వర్గాల నుంచి ఓ సమాచారం అందింది. జనవరి 1న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారట. అదేరోజున టైటిల్ లోగోను కూడా విడుదల చేస్తారట. ఇక జనవరి 26న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట. దేశభక్తితో ముడిపడి ఉన్న కథ కావడంతో రిపబ్లిక్ డే రోజున ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. ఠాగూర్ మధు. ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు