హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది : మహేష్

mahesh
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నేడు హైద్రాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించి టీమ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగానే మహేష్ మాట్లాడుతూ.. “నవీన్ నాకు చిన్నప్పట్నుంచీ బాగా పరిచయం. పోకిరి, అతడు సమయంలో అతడి ఎడిటింగ్ టాలెంట్ చూసి మంచి టాలెంటెడ్ అని అర్థమైంది. హీరో అవ్వడానికి ముందు నవీన్ చాలా కష్టపడ్డాడు. హర్ట్ వర్క్ చేసి సిక్స్‌ప్యాక్ కూడా చేశాడు. హర్డ్ వర్క్ చేస్తే తప్పక సక్సెస్ వస్తుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా.” అన్నారు. పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ రొమాంటిక్ కామెడీగా ప్రచారం పొందుతోంది.

 

Like us on Facebook