పాట షూటింగ్‌లో మహేష్ ‘శ్రీమంతుడు’

పాట షూటింగ్‌లో మహేష్ ‘శ్రీమంతుడు’

Published on May 23, 2015 10:26 AM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మహేష్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోరుకుంటున్న అభిమానులకు ఈ సినిమా ఆ కోరికను నెరవేరుస్తుందని సినిమా యూనిట్ టాక్. ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక నేటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనుంది. ఈ పాట కోసం ఓ అందమైన సెట్ కూడా వేశారట. మహేష్, శృతిహాసన్‌లపై ఈ పాటను చిత్రీకరించనున్నారు.

మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్నుంచీ ఓ కన్ఫ్యూజన్ ఉంది. ‘మగాడు’, ‘శ్రీమంతుడు’ ఇలా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. మే 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. అదేరోజు టైటిల్ విషయంలో ఉన్న కన్య్ఫూజన్‌కి కూడా తెరదించనున్నారు. ప్రస్తుతం 80% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు