సిక్స్‌ప్యాక్ లుక్‌లో మహేష్ విలన్!

సిక్స్‌ప్యాక్ లుక్‌లో మహేష్ విలన్!

Published on Sep 26, 2016 7:49 PM IST

sj-surya-babu
సూపర్ స్టార్ మహేష్, పాపులర్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ సినిమాల్లో టాప్ హీరో, డైరెక్టర్స్‌లలో ఒకరైన వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అవ్వడంతో, మొదట్నుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. ఇక దీంతో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఇందులో మహేష్‌కు విలన్‌గా నటించడం పెద్ద విశేషంగా కనిపిస్తూ వచ్చింది.

తెలుగు ప్రేక్షకులకు ‘ఖుషీ’, ‘నాని’, ‘పులి’ సినిమాలతో దర్శకుడిగా మాత్రమే పరిచయమున్న సూర్య, తమిళంలో పలు సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి, నటుడిగానూ ఓ మార్క్ సెట్ చేసుకున్నారు. తాజాగా మహేష్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆయన ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారట. క్లీన్ షేవ్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో సూర్య కనిపిస్తారట. అయితే ప్రస్తుతానికి దీనిపై టీమ్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సూర్య సిక్స్‌ప్యాక్ లుక్‌ను ప్రచారంగానే చూడాలి. మహేష్-ఎస్.జె.సూర్యల మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు