మహేష్ ‘శ్రీమంతుడు’కి హైలైట్ కాబోయే ఎపిసోడ్స్ ఇవే.!

మహేష్ ‘శ్రీమంతుడు’కి హైలైట్ కాబోయే ఎపిసోడ్స్ ఇవే.!

Published on Aug 2, 2015 9:25 PM IST

Srimanthudu
రైటర్ గా సక్సెస్ అయిన కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘మిర్చి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత శివ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ చేత ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ అనే డైలాగ్ తోనే సినిమా కాన్సెప్ట్ ని చెప్పిన కొరటాల శివ శ్రీమంతుడిలో మహేష్ బాబు చేత ‘మా ఊరి నుంచి చాలా తీసుకున్నాను.. తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే లావైపోతాను’ అనే డైలాగ్ ని చెప్పించారు. ఈ లైన్ ని బట్టే మీకీ సినిమాలో ఓ సోషల్ మేస్జ్ ఉందని తెలుస్తోంది. సోషల్ మెసేజ్ ఉన్నా ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ ఫార్మాట్ లోనే ఈ సినిమాని తీసారని మహేష్ బాబు తెలియజేశాడు.

తాజా సమాచారం ప్రకారం మేము ఈ సినిమాకి హైలైట్ కానున్న విషయాల గురించి తెలుసుకున్నాము. శ్రీమంతుడు సినిమాలో సినిమా అంతా ఒక ఎత్తు అయితే చివర్లో వచ్చే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఓ ఎత్తని సమాచారం. ప్రీ క్లైమాక్స్ నుంచి ఆడియన్స్ స్క్రీన్ పై నుంచి చూపు తిప్పుకోలేరని అంటున్నారు. అంతే కాకుండా క్లైమాక్స్ ఎపిసోడ్ లో చూపే కుటుంబ విలువలు, మానవతా విలువలని ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ చేయడమే కాకుండా, సినిమా అయ్యాక కూడా ప్రతి ఒక్కరినీ హంట్ చేసేలా ఉంటుందని సమాచారం. మేము ఇది వరకూ చెప్పినట్టు హై ఎండ్ ఎమోషన్స్ హో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. వీటితో పాటు ఇంటర్వల్ బ్లాక్ కూడా సినిమాకి హైలైట్ కానుంది.

మహేష్ బాబు – శృతి హాసన్ మొదటి సారి జోడీ కట్టిన ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు