అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై నాగ్ కామెంట్స్

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై నాగ్ కామెంట్స్

Published on Aug 29, 2015 6:13 PM IST

Akhil
ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి తమ వారసులు హీరోలుగా పరిచయం అవ్వడం కామన్ గా జరిగే విషయమే. కానీ మొదటి సినిమాకే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకొని, మొదటి సినిమాకే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉండడం, ఊహించని రీతిలో ఫస్ట్ సినిమా బిజినెస్ అయిపోవడం లాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే అఖిల్ అక్కినేని మొదటి సినిమా ‘అఖిల్’ విషయంలో జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవలే రిలీజ్ చేసారు.

ఈ రోజు అక్కినేని నాగార్జున బర్త్ డే కానుకగా బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ హీరో లుక్ అఖిల్ లో ఉంటుంది, మరి అఖిల్ ని బాలీవుడ్ లో లాంచ్ చెయ్యకుండా తెలుగులో ఎందుకు లాంచ్ చేస్తున్నారు అనే పాయింట్ పై నాగార్జున స్పందించారు. ‘అఖిల్ ఫస్ట్ కమర్షియల్ యాడ్ హిందీలోనే చేసాడు. అలాగే అఖిల్ కి మొదట బాలీవుడ్ లో లాంచ్ చేస్తామని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ మొదటగా తెలుగులో సూపర్ కాన్సెప్ట్ తో ఓ సినిమా చెయ్యి, అదే సినిమాతో హిందీలో కూడా వెళ్ళచ్చు అనే నా అభిప్రాయాన్ని చెప్పాను. అలాగే తను ఫస్ట్ తెలుగు సినిమా చేసాడు. ఇకపై బాలీవుడ్ ఎంట్రీ అనేది తన నిర్ణయం’ అని నాగార్జున తెలిపాడు.

దీని ప్రకారం చూసుకుంటే అన్నీ కుదిరితే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు