ప్రేమమ్ స్టార్ ఇంట గుడ్ న్యూస్ !

ప్రేమమ్ స్టార్ ఇంట గుడ్ న్యూస్ !

Published on May 25, 2017 1:09 PM IST

ప్రేమమ్ ఘన విజయం తరువాత మలయాళం హీరో నివిన్ పౌలీ సంచలనంగా మారిపోయాడు.ఈ స్టార్ హీరో ఇంట మరో శుభ సంఘటన జరిగింది. నివిన్ భార్య కొద్ది సేపటిక్రితమే అందమైన పాపకు జన్మనిచ్చింది.తల్లీ కూతుళ్లు ఇద్దరూ బావున్నారు. నివిన్ 2010 లో తన క్లాస్ మెట్ రిన్నా జాయ్ ని వివాహం చేసుకున్నాడు.

కాగా వీరికి 2012 లో ఓ కుమారుడు జన్మించగా, తాజాగా మరో పాప పుట్టింది.దీనితో నివిన్ ఫ్యామిలీ పరిపూర్ణమైందని చెప్పాలి.ఈ సందర్భంగా 123 తెలుగు నివిన్ కు అతని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేస్తోంది. నివిన్ ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా మారనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు