మామ మంచు అల్లుడు కంచు @ ఓన్లీ ఎంటర్టైన్మెంట్

మామ మంచు అల్లుడు కంచు @ ఓన్లీ ఎంటర్టైన్మెంట్

Published on Nov 29, 2015 11:27 AM IST

Mama-manchu-alludu-kanchi

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ఇటీవలే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ 40 ఏళ్ళ జర్నీ తర్వాత మోహన్ బాబు నుంచి వస్తున్న సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఆడియో గత రాత్రి హైదరబాద్ లో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు కామెడీ కింగ్ అల్లరి నరేష్ కూడా మరో హీరోగా కనిపించనున్నాడు.

నిన్న రాత్రి జరిగిన ఆడియో వేడుకలో పాటలతో పాటు, థియేటర్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, సినిమా ఫుల్ టూ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలియజేస్తోంది. మోహన్ బాబు – అల్లరి నరేష్ ల కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుందని ఈ చిత్ర టీం చెబుతోంది. అల్లరి నరేష్ 13 ఏళ్ళ కెరీర్లో ఇది 50వ సినిమా కావడం విశేషం. మోహన్ బాబు సరసన అలనాటి స్టార్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీన జోడీ కడితే, అల్లరి నరేష్ సరసన పూర్ణ జోడీ కట్టింది. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు