‘గుంటూరోడు’ గా కనిపించనున్న మంచు హీరో

‘గుంటూరోడు’ గా కనిపించనున్న మంచు హీరో

Published on Sep 30, 2016 2:55 PM IST

Manchu-Manoj
చాలా కాలంగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు హీరో మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. అజయ్ ఆండ్రస్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదికాక ‘క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కొత్త దర్శకుడు సత్య డైరెక్షన్లో మనోజ్ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి భిన్నమైన ‘గుంటూరోడు’ అనే టైటిల్ ను ఖాయం చేశారు. ఎందుకంటే సినిమా చాలా వరకూ గుంటూరు జిల్లా నైపథ్యంలో సాగుతుంది కాబట్టి.

అలాగే ఇందులో మనోజ్ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో మనోజ్ సరసన ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంపత్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ మధ్యలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు