‘కరెంటు తీగ’గా మంచు మనోజ్.?

‘కరెంటు తీగ’గా మంచు మనోజ్.?

Published on Apr 16, 2014 8:39 AM IST

Manchu_Manoj
‘పోటుగాడు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా విజయం తర్వాత మంచు మనోజ్ చేయాల్సిన కొత్త సినిమా ఇంకా ఒక్కటి కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’ సినిమా చేసిన జి. నాగేశ్వర రెడ్డి మనోజ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పర్ఫెక్ట్ కథ సిద్దం అయిన ఈ మూవీ మే రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి ‘కరెంటు తీగ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

కామెడీ, యాక్షన్ అంశాలు మేళవించిన ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమా పూర్త వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. ఇది కాకుండా మనోజ్ ‘s/o పెదరాయుడు’ అనే సినిమా కూడా చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు