త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మనోజ్ ‘కరెంటు తీగ’

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మనోజ్ ‘కరెంటు తీగ’

Published on Apr 20, 2014 11:38 AM IST

Manchu-Manoj
‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా తర్వాత షూటింగ్ లకి బాగా గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ త్వరలో తన తదుపరి యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్దమవుతున్నాడు.

ఈ సినిమాకి ‘కరెంటు తీగ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా టైటిల్ లాగానే సినిమా కూడా ఎనర్జిటిక్ గా ఉంటుందని సమాచారం.

మంచు మనోజ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ వారాంతం నుంచి మొదలు కానున్న రెగ్యులర్ షూటింగ్ లో భాగంగా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. జి. శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు