చరణ్ సిక్స్‌ప్యాక్‌ లుక్‌‍పై మంచు హీరో కామెంట్!

చరణ్ సిక్స్‌ప్యాక్‌ లుక్‌‍పై మంచు హీరో కామెంట్!

Published on Dec 6, 2016 10:40 AM IST

manchu-vishnu
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమా ప్రస్తావనే కనిపిస్తోంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 9న) భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక మొన్న విడుదలైన మేకింగ్ వీడియోలో ధృవ సిక్స్‌ప్యాక్ లుక్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదిరిపోయే సిక్స్‍ప్యాక్ లుక్ రావడం కోసం ఆయన పడిన కష్టానికి అభిమానులే కాక, సినీ ప్రముఖులు సైతం హ్యాట్సాఫ్ తెలిపారు.

హీరో మంచు విష్ణు, చరణ్ సిక్స్‌ప్యాక్ లుక్ గురించి మాట్లాడుతూ.. “చరణ్ లుక్ సెక్సీ ఉంది. దీన్ని కాకపోతే ఇంక దేన్ని సెక్సీ అంటారో చెప్పలేను. హార్డ్ వర్క్, డెడికేషన్‌తోనే ఇది సాధ్యమవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ధృవ” అంటూ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ధృవ సినిమా విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించగా, అరవింద్ స్వామి విలన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు