మంచు విష్ణులో నాకు శోభన్ బాబు కనిపిస్తాడు – దాసరి.

మంచు విష్ణులో నాకు శోభన్ బాబు కనిపిస్తాడు – దాసరి.

Published on Nov 1, 2014 9:19 AM IST

Erra-Bus-Audio-Launch-(44)
అందరికి విష్ణులో యాక్షన్ హీరో కనబడితే నాకు శోభన్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా ద్వారా విష్ణు ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుస్తుంది. క్లైమాక్స్ లో నాతో పోటిపడి నటించాడు. నా బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఎర్రబస్సు’ ఒకటిగా నిలుస్తుంది. అని అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు.
తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఎర్రబస్సు’. దాసరి, మంచు విష్ణు తాతా మనవళ్ళుగా నటించిన సినిమాలో కేథరిన్‌ త్రేసా హీరోయిన్. చక్రి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. అతను సంగీత దర్శకత్వం వహిస్తున్న 100వ సినిమా ఈ ‘ఎర్రబస్సు’. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందజేశారు. ఈవివి కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణముర్తి తొలి సిడిని 10,116రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని తుఫాన్ భాదితులకు విరాళం ఇస్తున్నట్టు దాసరి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన అతిదిలు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు