వర్మ – విష్ణుల మూవీ టైటిల్ ‘అనుక్షణం’

వర్మ – విష్ణుల మూవీ టైటిల్ ‘అనుక్షణం’

Published on Jul 31, 2014 11:58 AM IST

anukshanam

ప్రస్తుతం హిట్స్ లేదా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో, తన సినిమాల విషయంలో పలు వివాదాలు క్రియేట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ‘టెన్షన్ టెన్షన్’ లేదా ’12’ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.

కానీ నేటితో ఆ వార్తలకి తెరపడింది. ఫైనల్ గా వర్మ సినిమాకి ‘అనుక్షణం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు – వర్మ కాంబినేషన్లో ‘రౌడీ’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ మళ్ళీ అదే మేజిక్ ని రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు