‘అనుక్షణం’ లాంటి మూవీ చెయ్యాలంటే గట్స్ కావాలి – మంచు విష్ణు

‘అనుక్షణం’ లాంటి మూవీ చెయ్యాలంటే గట్స్ కావాలి – మంచు విష్ణు

Published on Aug 20, 2014 9:17 AM IST

Anuskhanam

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ – మంచు విష్ణు కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ‘అనుక్షణం’. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు ‘అనుక్షణం’ లాంటి సినిమా చెయ్యడానికి గట్స్ కావాలి అంటున్నాడు.

‘ ‘రౌడీ’ సినిమా స్టార్ట్ చెయ్యక ముందే రాము నాకు ఈ స్టొరీ చెప్పాడు. స్టొరీ విన్నాక నేను స్టన్ అయ్యాను. అలాగే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలి అంటే గట్స్ కావాలి. ఎందుకంటే నాకు వచ్చిన కమర్షియల్ సక్సెస్ లు అన్నీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలే.. చాలా మంది ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నావు, అస్సలు చెయ్యద్దు అన్నారు. కానీ నేను ఎప్పటికైనా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మదిలో ఉండాలి అనుకుంటున్నాను. అందుకే ఈ సినిమా చేసానని’ అన్నాడు.

మొట్ట మొదటిసారిగా ఈ సినిమాని వేలంపాట విధానం ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ కి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని, నవదీప్, సీనియర్ నటి రేవతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు