మణిశర్మకే ఫిక్స్ అయిన హను రాఘవపూడి!

మణిశర్మకే ఫిక్స్ అయిన హను రాఘవపూడి!

Published on Jan 17, 2017 11:34 AM IST

mani-sharma-hanu-raghavapud
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, తన కొత్త సినిమాను హీరో నితిన్‌తో చేస్తోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, చాలా గ్యాప్ తీసుకొని హను రాఘవపూడి సినిమా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా రేపట్నుంచి మరో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఇక ఈ సినిమాకు మొదట ఒక కొత్త సంగీత దర్శకుడినే ఎంచుకోవాలని అనుకున్న హను రాఘవపూడి, చివరకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ఫిక్స్ అయ్యారు. గత కొద్దికాలంగా మణిశర్మకు పెద్ద సినిమాలు రావడం తగ్గాయి. ఈ నేపథ్యంలోనే నితిన్-హను సినిమా కోసం ఆయన తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. హను ఇప్పటివరకూ చేసిన రెండు సినిమాల్లోనూ కొత్తవారినే సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఇప్పుడు మణిశర్మ రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. స్టార్ హీరో అర్జున్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు