సంచలన అంశాలతో తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ !

సంచలన అంశాలతో తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ !

Published on Dec 29, 2016 11:45 AM IST

appatlookadundevaadu
దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో ‘శ్రీ విష్ణు, నారా రోహిత్’ ప్రధాన పాత్ర దారులుగా రూపొందిన చిత్రమే ‘అప్పట్లో ఒకడుండేవాడు’. రేపు 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో 1990ల ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన పలు కీలక, సంచలన నిజాలను చూపారని తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా మాజీ ప్రధాని పివి నరసింహ రావు వ్యక్తిత్వం, రాజకీయం ఎలాంటిది, ఆయన చేసిన రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు ఏంటి, వాటిలో ఇన్వాల్వ్ అయినా ఇతర రాజకీయ నాయకులు ఎవరు అనేది చూపించారట.

అలాగే హైదరాబా లో ఆంద్ర ప్రాంతంగా చెప్పబడే కూకట్ పల్లి భూముల ఇప్పుడు ఇంత భారీ రేటు పలకడానికి 90ల దశకంలో నడిచిన రియలెస్టేట్ వ్యాపారం ఎలా కారణమైంది. అందులో ఎవరెవరు ఎంత సంపాదించారు అనేది, రెండు దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన స్టాంపుల కుంభకోణం వివరాలు అంతేగాక 1990లో హైదరాబాద్ లో నెలకొన్న నాటు బాంబుల కల్చర్ ఎటువంటిది, దానికి వలన ఒక తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నుండి ఎలా దిగిపోవాల్సి వచ్చింది అనే పలు ఆసక్తికర అంశాలను చూపారట. మరి విడుదల తరువాత ఈ చిత్రం ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు