‘భరత్ అనే నేను’లో చాలా సీన్లు తొలగించారట !

‘భరత్ అనే నేను’లో చాలా సీన్లు తొలగించారట !

Published on Apr 18, 2018 11:16 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఇంకో రెండు రోజుల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా హీరో మహేష్ బాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో రెండు పార్ట్స్ రూపొందించగల కంటెంట్ ఉందని, చాలా సన్నివేశాలను ఎడిటింగ్లో తొలగించామని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

ఇలా చాలా సీన్లను ఎడిట్ చేసిన తర్వాత కూడ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిముషాలుగా ఉండటం ఆసక్తిని రేకెత్తించే విషయం. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయగా దానయ్య నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ సినిమాను అమెరికాలో 2000ల ప్రీమియర్ షోల ద్వారా విడుదల తేదీ ముందురోజు ప్రదర్శించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు