మరో బ్లాక్ బస్టర్ కథ పనిలో బిజీగా ఉన్న మారుతి

మరో బ్లాక్ బస్టర్ కథ పనిలో బిజీగా ఉన్న మారుతి

Published on Oct 8, 2015 8:40 AM IST

maruthi
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట.. ఇలావరుసగా హిట్స్ అందుకుంటూ సినిమా సినిమాకి తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. చిన్న బడ్జెట్ లో సినిమా తీసి అంతకు రెండింతలు ప్రాఫిట్స్ తెచ్చే పెట్టె డైరెక్టర్ గా పెరూ తెచ్చుకున్న మారుతి రీసెంట్ గా భలే భలే మగాడివోయ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తన మార్కెట్ ని 25 కోట్లకి తీసుకెళ్ళింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న మారుతి బర్త్ డే ఈ రోజు..

ఈ సందర్భంగా తన సంస్థ శ్రేయాస్ మీడియాలో బర్త్ డే వేడుకలు జరిగాయి. అక్కడ మారుతి మాట్లాడుతూ ‘భలే భలే మగాడివోయ్ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చింది. ఇటీవలే యుఎస్ వెళ్లి వచ్చాను. అక్కడి వారంతా సినిమాపై ప్రశంశల జల్లు కురిపించిండం, నాకు కితాబులు ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నా తదుపరి సినిమా విషయంలో మరింత బాధ్యతని పెంచింది. భలే భలే మగాడివోయ్ ఇచ్చిన సక్సెస్ పలు ఆఫర్స్ ని తెచ్చి పెడుతోంది. కానీ ప్రస్తుతం నేను మరో మంచి కథ రాసే పనిలో ఉన్నాను. ఆ కథ అంతా పూర్తయ్యాక హీరోని ఫిక్స్ చేసుకుంటాను. ఈసారి కూడా మరో బ్లాక్ బస్టర్ కథతోనే వస్తానని’ తెలిపాడు. మరి మారుతి ఎలాంటి కథని సిద్దం చేసి ఏ యంగ్ హీరోని హీరోగా సెలక్ట్ చేసుకుంటాడు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మారుతికి 123తెలుగు.కామ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు