మారుతి నానితో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడా ?

మారుతి నానితో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడా ?

Published on Mar 22, 2020 10:31 PM IST

నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. వీరి ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. కాకపోతే వీరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు