సూర్య ‘రాక్షసుడు’కి మంచి ఓపెనింగ్స్!

సూర్య ‘రాక్షసుడు’కి మంచి ఓపెనింగ్స్!

Published on May 30, 2015 9:03 AM IST

Rakshasudu-First-Look
సూర్య నటించిన ‘రాక్షసుడు’ నిన్న విడుదలైంది. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రానికి భారీ రీతిలో ఓపెనింగ్స్ దక్కడం విశేషం. వాటిలో ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో సాధించిన ఓపెనింగ్స్ శాతం అధికమే.ఓవర్ సీస్ లో సైతం మంచి కలెక్షన్లను అందుకుంటుంది. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

సూర్య గత చిత్రం సికిందర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కి వీకెండ్ జోరు కూడా తోడవ్వనుండడంతో ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు