ఆ హింట్ మాస్టర్ టీజర్ కోసమేనా..?

ఆ హింట్ మాస్టర్ టీజర్ కోసమేనా..?

Published on Apr 10, 2020 12:00 AM IST

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న భారీ చిత్రాలలో మాస్టర్ ఒకటి. తలపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా కరోనా లాక్ డౌన్ లేకుంటే ఈ నెలలో విడుదల కావాల్సింది. కాగా నేడు ఈ మూవీ నుండి ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ పై లాక్ డౌన్ మాస్టర్ ని ఏమీ చేయలేదు, త్వరలో మాస్టర్ ని మీరు చూస్తారని అర్థం వచ్చేలా ఓ కోట్ ఉంది. అనగా త్వరలో ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరకల్పనలో విడుదలైన సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి రోల్ చేయడం విశేషం. మాస్టర్ లో విజయ్ గ్యాంగ్ స్టర్, కాలేజీ ప్రొఫెసర్ గా రెండు భిన్న రోల్స్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు