భారీ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షీ దీక్షిత్

భారీ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షీ దీక్షిత్

Published on Jul 31, 2014 12:39 AM IST

Meenakshi-Dixit (1)

‘అడవి కాచిన వెన్నెల’ సినిమాలో నటించిన మీనాక్షీ దీక్షిత్ ఆ సినిమాతో మంచి బ్రేక్ ని ఆశిస్తుంది. థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో అరవింద్ కృష్ణ హీరోగా నటించాడు. మీనాక్షీ మన తెలుగు ఇండస్ట్రీలో చాన్నాళ్ళగా నటిస్తూనే వుంది. మహేష్ బాబు ‘దూకుడు’, ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ లలో ఐటెం సాంగ్ లలో నటించింది. అయినా ఈ లక్నో భామకు ఆశించినంత గుర్తింపు రాలేదు

బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకోవడానికి మరియు తనలో టాలెంట్ ని నిరువుపించుకోవడానికి ‘అడవి కాచిన వెన్నెల’ సినిమా సరైన అవకాశంగా భావిస్తుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో చాలా చోట్ల ఈ శుక్రవారం విడుదలకానుంది.అక్కి విశ్వనాద్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. మరి ఈ సినిమాతో నైనా మీనాక్షీ కధ నిజంకావాలని కోరుకుందాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు