ఎన్టీఆర్ ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు..!

ఎన్టీఆర్ ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు..!

Published on Jun 7, 2020 8:57 AM IST

కొద్దిరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నటి మీరా చోప్రా.. ఎన్టీఆర్ ఫ్యాన్ ని కాదు, ఆయన గురించి నాకు ఏమి తెలియదు అన్నందుకు వారు ఆమెపై సోషల్ మీడియాలో దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీనితో ఆమె తెలుగు రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు, జాతీయ మహిళా కమీషనర్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ విషయం చర్చకు దారి తీయగా, అనేక మంది ఫెమినిస్ట్ ఆమెకు తోడుగా వచ్చారు.

ఈ విషయం ఎన్టీఆర్ ని తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్లు తెలుస్తుంది. తాత నందమూరి తారకరామారావు గారి దగ్గర నుండి నందమూరి కుటుంబానికి మహిళకు చాలా గౌరవం ఇస్తారనే పేరుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆడవారికి ఉన్నతమైన స్థానం. ఇస్తారు. అలాంటి ఆయన ఫ్యాన్స్ పేరున జరుగుతున్న ఈ వివాదం ఆయనను ఇబ్బందికి గురిచేసిందట. ఈ వివాదం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. కొందరు ఫ్యాన్స్ కి ఇప్పటికే నోటీసులు అందగా, ఈ గొడవ ఎంత వరకు వెళుతుందో అర్థం కావడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు