టీవీ టి.ఆర్.పితోనూ రికార్డ్స్ సృష్టించిన మెగా హీరోస్

టీవీ టి.ఆర్.పితోనూ రికార్డ్స్ సృష్టించిన మెగా హీరోస్

Published on Jul 31, 2014 3:06 PM IST

trp

మెగా హీరోల సినిమా వస్తుంది అంటే ఎంత క్రేజ్ ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీరి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించడమే కాకుండా బుల్లితెరపై కూడా రికార్డ్ స్థాయిలో టి.ఆర్.పి రేటింగ్స్ సాధించాయి. 2014లో ఇప్పటి వరకూ టీవీలో ప్రసారమయ్యి టాప్ 3 టి.ఆర్.పి రేటింగ్స్ దక్కించుకున్న సినిమాలు కూడా మెగా ఫ్యామిలీకి చెందినవే కావడం విశేషం. ఆ సినిమాలే ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘కొత్త జంట’.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించ్గిన అత్తారింటికి దారేది సినిమా బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే కాకుండా టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమయినప్పుడు 19 పాయింట్స్ రేటింగ్ తెచ్చుకుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఎవడు’. ఈ సినమా 2014 సంక్రాతికి విడుదలై సూపర్ హిట్ కావడమే కాకుండా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమయినప్పుడు 10.14 పాయింట్స్ రేటింగ్ తెచ్చుకుంది.

అల్లు శిరీష్ – రేజీన జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొత్త జంట’ సినిమా అకూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమయినప్పుడు 9.4 పాయింట్స్ రేటింగ్ తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు