మెగా హీరో సినిమా విడుదలకు సిద్దం !

మెగా హీరో సినిమా విడుదలకు సిద్దం !

Published on Nov 18, 2017 1:17 PM IST

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మంచి విజయం అందుకున్న అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఒక్క క్షణం’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ దర్శకుడు. సైన్స్ ఫిక్ష్శన్ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ సినిమా టైటిల్ లోగో మరియు విడుదల తేదిని ఈరోజు సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అబ్బూరి రవి మాటలు అందిస్తోన్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు