మెగా హీరో సినిమా షూటింగ్ అప్దేట్స్ !
Published on Dec 9, 2017 6:15 pm IST

సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా ఇటివల విడుదలైంది. ఈ సినిమా తరువాత రెండు సినిమాల్లో నటించబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. వివి. వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభం అయ్యింది. తాజా సమాచారం ప్రకారం కరుణాకర్ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న సినిమా ఈ నెల 12 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్సియల్ బ్యానర్ లో కెఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ మూవీ కి స్వరాలు సమకూరుస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్తోరితో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

 
Like us on Facebook