మొదలైన మెగా హీరో సినిమా !

మొదలైన మెగా హీరో సినిమా !

Published on Apr 19, 2018 1:15 PM IST


ఇటీవలే ‘తొలిప్రేమ’ సినిమాతో ఘనమైన విజయాన్ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాను మొదలుపెట్టారు. మొదటి చిత్రం ‘ఘాజి’తోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అంతరిక్షం నైపథ్యంలో సాగే కథగా ఉండనున్న ఈ సినిమాను ఈరోజే పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.

ఇప్పటీకే ఈ చిత్ర షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ ను రూపొందిస్తున్నారు. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం నటీ నటులు జీరో గ్రావిటీ వాతావరణంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు కూడ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు