సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వినాయక్ సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఫిబ్రవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమా కూడా ఫిబ్రవరి 9 న విడుదల కానుందని గతంలోనే ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. నూతన దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్న హీరోయిన్ గా నటిస్తోంది.
- విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ సినిమా !
- కొత్త సినిమా కోసం ప్రభాస్ గ్రౌండ్ వర్క్ !
- సీనియర్ హీరోని డైరెక్ట్ చేయనున్న ‘అ !’ చిత్ర దర్శకుడు ?
- ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ !
- చిట్ చాట్: బెక్కం వేణుగోపాల్ – పెద్ద హీరోలతో చేసే అవకాశమున్నా కథ నచ్చి ఈ చిన్న సినిమా చేశాను !
సంబంధిత సమాచారం :
