మెగాస్టార్ ‘ఆచార్య’ ప్లాష్ బ్యాక్ లో ?

మెగాస్టార్ ‘ఆచార్య’ ప్లాష్ బ్యాక్ లో ?

Published on Jul 5, 2020 7:48 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని కాకపోతే పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే అలా కనిపిస్తారట.

పైగా ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు