వాళ్ళను మెగాస్టారే ఆదుకోవాలి !

వాళ్ళను మెగాస్టారే ఆదుకోవాలి !

Published on Apr 8, 2020 7:15 PM IST

కరోనా మహమ్మారిని నివారించడానికి చేపట్టిన లాక్ డౌన్ ను పొడిగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో అతలాకుతలం అయిపోతున్నారు. సినీ పెద్దలు ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’ పెట్టి సాయం అందిస్తున్నప్పటికీ… ఆ సాయం కేవలం ఫిల్మ్ కి సంబంధించి ఏదొక అసోసియేషన్ లో మెంబర్ అయినవాళ్లకు మాత్రమే చేస్తున్నారు. అయితే, సినిమాలకు పని చేసే వాళ్లల్లో కొంతమందికి ఎలాంటి మెంబర్ షిప్ ఉండదు. దాంతో మెంబర్ కాని వాళ్లకు ఎలాంటి సాయం అందడం లేదు.

షూటింగ్స్ జరిగితేనే వాళ్లకు రోజులు గడుస్తాయి. దీనితో ఏ క్రాఫ్ట్ లో మెంబర్ కాని వేల మంది సినీ కార్మికులకు ఎలాంటి సాయం అందకా, ఎలాంటి ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రాబోయే రోజుల్లో కూడా షూటింగ్స్ మొదలవ్వలేదంటే.. వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగా మారుతుంది. సంపాదనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో కొంతమందిది పస్తులు పడుకునే పరిస్థితి.

కాగా మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో నడుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) అలాంటి మెంబర్ కానీ సినీకార్మికుల్ని కూడా గుర్తించి ఆదుకుంటే బాగుంటుంది. ‘సీసీసీ’కి ఇప్ప‌టికే తార‌లు స‌హా ప‌లువురు దాత‌ల నుంచి విరాళాలు వచ్చాయి. ప్రస్తుతం 24 శాఖ‌లలోని పేద‌ల‌కు స‌రుకుల్ని పంపిణీ చేస్తున్నారు. వారితో పాటు తీవ్ర ఇబ్బందలు పడుతున్న మెంబర్ కాని కార్మికులను కూడా మెగాస్టార్ ఆదుకుంటారని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు