మెగా హీరో సినిమాకి మెగాస్టార్ టైటిల్ !


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బివిఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ సినిమా చేస్తూనే మరో కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. అది కూడా యూత్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కావడం విశేషం. ఫిలిమ్ నగర్ సమాచారం ప్రకారం ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందట.

ఇక ఈ ప్రాజెక్టులో అసలు విశేషమేమిటంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మహానగరంలో మాయగాడు’ టైటిల్ ను పెట్టాలనే యోచన జరుగుతోందట. ఇప్పటికే పలుసార్లు మేనమామ మెగాస్టార్ పాటల్ని తన సినిమాల్లో రీమిక్స్ చేసి మెగా అభిమానుల ఆదరణను చొరగొన్న ధరమ్ తేజ్ ఈ టైటిల్ ను తన సినిమాకి పెట్టుకుంటాడో లేదో ఖచ్చితంగా తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి. ఇకపోతే తేజ్ నటించిన ‘నక్షత్రం’ ఆగష్టు 4న విడుదలవుతుండగా వివి. వినాయక్, కరుణాకరన్ వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడు.

 

Like us on Facebook