బాలయ్య శాతకర్ణి హిట్టవ్వాలని కోరుకున్న మెగాస్టార్ !

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం 150’ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ల మధ్య ఈ సంక్రాంతికి భారీ పోటీ నెలకొన్న నైపథ్యంలో చిరు బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తన ఖైదీ సినిమా గురించి మీడియాతో ముచ్చటించిన చిరు బాలయ్య శాతకర్ణితో తన సినిమాకి నెలకొన్న పోటీ గురించి మాట్లాడుతూ నాకు, బాలకృష్ణకు మధ్య అసలు పోటీ లేదు. రెండు సినిమాలు ఒకేసారి రిలీజవుతున్నాయంతే అన్నారు.

అలాగే బాలకృష్ణ 100వ సినిమాను కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించింది నేనే. దర్శకుడు క్రిష్ ‘కంచె’ సినిమా తీసినప్పుడు అతన్ని పర్సనల్ గా పిలిచి అభినందించాను. నా మిత్రుడు బాలకృష్ణ సినిమా సూపర్ హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంక్రాంతికి రిలీజయ్యే ప్రతి సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అంటూ ఆరోగ్యకరమైన సంక్రాంతి వాతావరణానికి తెరలేపారు. ఇకపోతే ఈ రెండు భారీ సినిమాల మధ్య దిల్ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’, ఆర్ నారాయణమూర్తి నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంట్రామయ్య’ సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

 

Like us on Facebook