చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ తోనే కళ్యాణ్ దేవ్ సినిమా !

చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ తోనే కళ్యాణ్ దేవ్ సినిమా !

Published on May 23, 2018 10:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి తోడ్పడిన సినిమాల్లో ‘విజేత’ కూడా ఒకటి. 1985లో విడుదలైన ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా అంటే తనకెంతో ఇష్టమని మెగాస్టార్ కూడ పలు సందర్బాల్లో అన్నారు. ఇప్పుడు ఇదే సూపర్ హిట్ టైటిల్ ను ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాకు కూడ పెట్టారు.

వెండి తెరపైకి ఎంట్రీ ఇస్తూ నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ చేస్తున్న సినిమాకు ‘విజేత’ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఎదుటివారి మొహాలపై నవ్వులు పూసేలా చేయడం కూడ ఒక విజయమే అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు