ఎన్టీఆర్ సరసన మెహ్రీన్ కౌర్ ?

ఎన్టీఆర్ సరసన మెహ్రీన్ కౌర్ ?

Published on Apr 28, 2017 6:18 PM IST


‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కెరీర్ ఆ సినిమా తర్వాత నెమ్మదిగానే సాగినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం జెట్ స్పీడ్ అందుకుంది. ఒకదాని వెంట ఒకటి గా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం మెగా హీరో ధరమ్ తేజ్ సరసన ‘జవాన్’ సినిమాలో నటిస్తున్న ఆమె రవితేజతో ‘రాజా ది గ్రేట్’, శర్వానంద్-మారుతిల సినిమాలో, మంజుల డైరెక్షన్లో సుందీప్ కిషన్ చేయనున్న సినిమాలో అవకాశాలు దక్కించుకుని బిజీగా ఉంది.

అంత బిజీలో ఉన్న ఆమెకు స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేతిలోకి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘జై లవ కుశ’ తో ఎన్టీఆర్, పవన్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండగా వారిద్దరూ ఆయా ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక కలిసి ఒక సినిమా చేస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్టులోనే మెహ్రీన్ ఛాన్స్ కొట్టేసిందని వినికిడి. అసలు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలోనే సరైన క్లారిటీ లేదు అలాంటిది అందులో మెహ్రీన్ హీరోయిన్ గా కుదిరిందనడం కాస్త అతిశయోక్తిగానే ఉన్నా ఈ వార్తపై పూర్తి నిర్ధారణ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు