‘భాగమతి’ ఫస్ట్ లుక్ తో మెస్మరైజ్ చేసిన అనుష్క !
Published on Nov 6, 2017 6:19 pm IST

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటిస్తున్న ‘భాగమతి’ ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఊహించని రీతిలో ఉన్న ఈ లుక్ ను చూసి అందరూ థ్రిల్ అవుతున్నారు. టైటిల్ చూసి ఏదో క్లాస్ గా, గ్రాండ్ గా వింటేజ్ లుక్ తో అనుష్క కనిపిస్తుందని ఊహిస్తే భయానక రీతిలో దర్శమిచ్చింది స్వీటి. పోస్టర్లో కాస్ట్యూమ్స్ దగ్గర్నుండి కలరింగ్ వరకు అన్నీ హర్రర్ సినిమానే గుర్తుచేస్తున్నాయి.

ఒక చేతిలో ఆయుధంతో మరొక చేయి గోడకు బందింపబడి ఉన్న అనుష్క లుక్ చూస్తుంటే సినిమాలో థ్రిల్ చేసే అంశాలు చాలానే ఉన్నాయని, కథ కూడా కొత్తగానే ఉంటుందని స్పష్టమవుతోంది. హర్రర్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో అనుష్క నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలలో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

 
Like us on Facebook