కమర్షియల్ సినిమాలు మిస్ అవుతున్నాను – టబు

కమర్షియల్ సినిమాలు మిస్ అవుతున్నాను – టబు

Published on Sep 2, 2014 1:53 AM IST

Tabu
‘కూలీ నెం1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ ఆకట్టుకున్న టబు ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేసారు. టబు ఈ సంవత్సరం ‘హైదర్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘కమర్షియల్ సినిమాలు చేయడం బాగా మిస్ అవుతున్నాను. అవకాశం వస్తే వెంటనే చేస్తానని’ తెలిపింది.

టబు తన కెరీర్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేసింది. కేవలం కమర్షియల్ సినిమాలతోనే కాకుండా ‘చాందిని బార్’, ‘అస్తిత్వ’ లాంటి సినిమాలతో నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. టబు చివరిగా చేసిన డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘పాండురంగడు’. ప్రస్తుతం తనకి కమర్షియల్ సినిమాలపై ఉన్న ఆసక్తి చూసి ఇక్కడి వారు ఆమెకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు