ఓన్లీ యాక్షన్ అంటున్న ఎన్టీఆర్ !

ఓన్లీ యాక్షన్ అంటున్న ఎన్టీఆర్ !

Published on Apr 25, 2018 8:50 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమా కొద్దిరొజుల క్రితమే హైదారాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలుత తారక్ పై హెవీ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించిన త్రివిక్రమ్ ఇప్పుడు మరొక పోరాట సన్నివేశాన్ని కుడా చిత్రీకరిస్తునార్నట.

ఈ చిత్రీకరణ ఏప్రిల్ 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో తారక్
సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ నందమూరి హీరో ప్రత్యేకంగా ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని మరీ కొత్త లుక్ ట్రై చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు