భాగమతిలో రెండో భాగం కీలకం !

భాగమతిలో రెండో భాగం కీలకం !

Published on Jan 24, 2018 11:39 AM IST

అనుష్క ప్రధాన పాత్ర లో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భాగమతి’. ‘మహానుబావుడు’ సినిమా తరువాత యు.వి. క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇదేఅవ్వడం విశేషం. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ముఖ్యంగా రెండో సగంలో ముఖ్య పాత్రలు పరిచయం కానున్నాయని సమాచారం. సినిమాలో కీలక సన్నివేశాలు అందరిని ఆకట్టుకోబోతున్నాయి. కథనంలో కొత్తదనం ఉండేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. బాహుబలి సినిమా తరువాత అనుష్క నుండి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై పాజిటివ్ బజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు