‘స్పైడర్’ గురించిన ముఖ్యమైన అప్డేట్స్ రేపే !


మహేష్ బాబు అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘స్పైడర్’. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇది వరకే విడుదలవాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదాలుపడుతూ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇకపోతే ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత ఈ సినిమా గురించిన మరో అప్డేట్ ఏదీ బయటకురాలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

వాళ్ళ నిరుత్సాహాన్ని పోగొట్టేలా స్పైడర్ టీమ్ రేపు కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో సినిమా ఆడియో, ట్రైలర్ విడుదలకు సంబందించిన సమాచారం కూడా ఉండే అవకాశాముంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్న సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే మహేష్ ఈ సినిమాతో పాటే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.

 

Like us on Facebook