వివాదాస్పద సినిమా తెలుగులో విడుదల !
Published on Jan 18, 2018 6:59 pm IST

ఎన్నో వివాదాలు, మరెన్నో బెదిరింపులు, అడ్డంగులను అధిగమించి ‘పద్మావత్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమా డబ్ వర్షన్ అదే రోజు విడుదలవ్వడం విశేషం. ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యాక కూడా హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తారాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సినిమా ప్రదర్శించరాదని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి.

ఈ విషయం పై చిత్ర యూనిట్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. త్వరలో కోర్ట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఇప్పుడు విడుదల కానుంది. టైటిల్ మార్చడంతో సెన్సార్ రిలీజ్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. విడుదల తరువాత ఈ సినిమా మరెంత దుమారం లేపబోతోందో చూడాలి.

 
Like us on Facebook