షూటింగ్‌లో అపశృతి.. ఇద్దరు నటులు మృతి!

kannada
కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తోన్న ‘మస్తీ గుడి’ సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుని ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే ఈ రోజు వెస్ట్ బెంగుళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పగొండనహల్లి సరస్సు వద్ద మస్తీ గుడి చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో భాగంగా ఓ స్టంట్ లో అనిల్ మరియు ఉదయ్ ఇద్దరు హెలికాఫ్టర్ పై నుండి సరస్సులోకి దూకారు. వారితో పాటే చిత్ర హీరో దునియా విజయ్ కూడా సరస్సులోకి దూకాడు.

వారి ముగ్గురిలో అనిల్, ఉదయ్ లు సరస్సులో మునిగిపోయారు. హీరో విజయ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. విషయాన్ని గమనించిన సిబ్బంది తేరుకుని చర్యలు తీసుకునే లోపే ఆ ఇద్దరు యువ నటులు సరస్సులో గల్లంతైపోయారు. కాసేపటికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వారు అనిల్, ఉదయ్ చనిపోయినట్లు తెలిసింది. స్టంట్ చేసే సమయంలో కేవలం హీరో విజయ్ కు మాత్రమే భద్రత ఉదని మిగతా ఇద్దరికీ అలాంటివేమీ లేవని అక్కడే ఉన్న ఆ ఇద్దరు నటుల సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Like us on Facebook